తను పుట్టిన గడ్దకు ..పెరిగిన గ్రామానికి .నమ్ముకున్న ప్రజలకు మంచి చేయాలంటే కావాల్సింది పదవులు కాదు .మంచి మనస్సు అని ఏకంగా తన గ్రామాన్నే దత్తత తీసుకోని త్రాగునీటి వ్యవస్థ నుండి సాగునీటి వ్యవస్థ వరకు .బడికేళ్ళే పొరగాడి దగ్గర నుండి డీగ్రీలు పూర్తి చేసి ఉద్యోగాల కోసం ఎదురుచూసే యువత కోసం.. పండు ముసలవ్వ దగ్గర నుండి రైతన్న వరకు ఇలా అన్ని వర్గాలకు చెందిన ప్రజల సంక్షేమమే తన ధ్యేయమని..వారి అభివృద్ధే తన అభిమతమని నమ్మి పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలని అమలు చేసి వరికోలు గ్రామాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దిన రీయల్ శ్రీమంతుడు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి .
ఈ రోజు ఆయన తన సొంత గ్రామం.. దత్తత తీసుకున్న వరికోలు గ్రామంలో పర్యటించారు.ఈ సందర్భంగా గతంలో తన సొంత దబ్బులతో సుమారు ఇరవై ఐదు లక్షలను వెచ్చించి పేదవారికి సర్కారు నిర్మించి ఇస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి ఐదేకరాల భూమి రిజస్ర్టేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతేకాకుండా ఇక్కడ జరుగుతున్న డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించి ..త్వరగా నిర్మించి పేదవారికి అందించాలని సూచించారు..
తన పేరు మీద ఉన్న 7 ఎకరాల భూమిని దళితులకు భూ పంపిణీ కోసం ఎస్సీ కార్పొరేషన్ కు అందించడం జరిగింది… వరికోల్ గ్రామంలో స్థానిక గ్రామ పంచాయతీ లో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించారు..గ్రామంలో నిర్మిస్తున్న నూతన ఆలయాన్ని పరిశీలించారు .సరికొత్తగా నిర్మించిన గ్రామ పంచాయితీ లో పెండింగ్ పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు..