Home / 18+ / టీడీపీ ఎమ్మెల్యే వర్గీయుల దౌర్జన్యం

టీడీపీ ఎమ్మెల్యే వర్గీయుల దౌర్జన్యం

అధికారంలో ఉన్నామన్న ధైర్యంతో రోజురోజుకు టీడీపీ నేతల దౌర్జన్యాలు,ఆగడాలు పెరిగిపోతున్నాయి.ఇష్టారాజ్యంగా చేలరేగిపోతున్నారు.అనంతపురంలోని హమాలీ కాలనీలో మాజీ మంత్రి అనంత వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో కావాలి జగన్‌–రావాలి జగన్‌ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేయగా..టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి వర్గీయులు అవి చూసి జీర్ణించుకోలేక వైసీపీ ప్లెక్సీలను చించివేశారు.ముగ్గురు టీడీపీ కార్యకర్తలను స్థానికులు పోలీసులకు అప్పగించారు.

ప్రభాకర్‌ చౌదరి వర్గీయుల దౌర్జన్యాలను నిరసిస్తూ వైఎస్ఆర్‌సీపీ నేతలు ఆందోళనకు దిగారు.అనంతపురంలో టీడీపీ నేతల దౌర్జన్యాలు ఎక్కువ అవుతున్నాయి అని మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌ రెడ్డి మండిపడ్డారు.రాజకీయంగా ఎదుర్కొలేక ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.ప్లెక్సీలను చించివేసిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలన్నారు.అధికారం ఉంది కదా అని దౌర్జన్యాలు చేస్తే ఇక సహించేది లేదని చెప్పారు.