Home / 18+ / ఏబీఎన్ చానల్ సాక్షిగా బయటపడిన చంద్రబాబు-రాధాకృష్ణల కుట్ర.. ఎన్టీఆర్ అభిమానుల ఆందోళన

ఏబీఎన్ చానల్ సాక్షిగా బయటపడిన చంద్రబాబు-రాధాకృష్ణల కుట్ర.. ఎన్టీఆర్ అభిమానుల ఆందోళన

తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు పేరు ఎక్కడా కనిపించకుండా చేసేందుకు చంద్రబాబు పన్నిన కుట్ర ఏబీఎన్ సాక్షిగా బట్టబయలైంది. అన్న నందమూరి తారకరామారావు పేరును ఏ ప్రభుత్వ పథకానికీ లేకుండా చేసేందుకు ఏబీఎన్ రాధాకృష్ణ వద్ద చంద్రబాబు ఎన్టీఆర్‌ను దూషించిన వీడియో వైరల్‌ అయిందిజ ఎన్టీఆర్ పేరు ఎక్కడా కన్పించకుండా చేసేందుకు ఇద్దరూ కలసి పన్నిన కుట్రపై ఎన్టీఆర్‌ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్‌ ఆరోగ్యశ్రీ పేరు ఇంకా ఎందుకు మార్చలేదని రాధాకృష్ణ అడగగా చంద్రబాబు ఎన్టీఆర్ ను ఉద్దేశించి ‘‘వాణ్ణి అనవసరంగా క్యారీ చేస్తున్నాం.. ఎన్టీఆర్‌ ఆరోగ్యశ్రీలోంచి వాడి పేరు ఎత్తేసి మన మీడియాలో ఫుల్‌ పబ్లిసిటీ ఇద్దాం. ఆరు నెలల తర్వాత ఇక చూసుకో..’’ అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఎన్టీఆర్‌ పేరుతో ఉన్న ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్‌ వైద్య భరోసా)ను పేరు మార్చడంతోపాటు ఆరు నెలల తర్వాత పూర్తిగా దీనిని ఎత్తి వేయాలని వారు పథకం వేశారు.. ఇందులో ఎన్టీఆర్‌ పేరును తొలగించే విషయం రాధాకృష్ణ, చంద్రబాబు మధ్య చర్చకువచ్చింది. పేరు తొలగిద్దామనగానే తీసేయండి అని రాధాకృష్ణ సలహా ఇచ్చేశారు.

వారి మధ్య జరిగిన సంభాషణ ఇలా ఉంది..
చంద్రబాబు : అప్పుడా టెక్నాలజీ లేదు. ఇప్పుడు వినియోగిస్తున్నాం. అదో టెక్నాలజీ. ఉద్యోగాలు, గిద్యోగాలు పోవడం..కరువు వచ్చినప్పుడు చేయకుండా పోవడం, ఉద్యోగస్తులను తిట్టడం….
రాధాకృష్ణ : అప్పుడు మీరు చేసినంత ఫుడ్‌ఫర్‌ వర్క్‌ ఎవరూ చేయలేదు.
చంద్రబాబు : దానిని మిస్‌ యూజ్‌ చేశారు.
రాధాకృష్ణ : ఫస్ట్‌ వైజాగ్, తర్వాత తిరుపతి, చివరకు విజయవాడ లైవ్‌లోకి తీసుకోండి. ఏబీఎన్‌ లైవ్‌కు యూట్యూబ్‌లో హైయ్యెస్ట్‌ లైక్స్‌ రావాలి.
రాధాకృష్ణ : యూట్యూబ్‌లో మనది టాప్‌.
చంద్రబాబు : వ్యూయర్‌షిప్‌లో మనది ఎంత?
రాధాకృష్ణ : మనది మూడు లేదా నాలుగో స్థానం
టెక్నికల్‌ టీమ్‌: (చంద్రబాబుతో) వైజాగ్‌ ఇంకో సిటీని కలిపాం సార్‌
చంద్రబాబు : ఇప్పటివరకు ఎన్ని ఉన్నాయి? రెండూ కలిపితే లక్షా ఇరవై వేలు ఉంటాయా? నేను చెప్పినప్పుడు నీవు వస్తావా?
రాధాకృష్ణ : వచ్చినా నష్టంలేదు.
చంద్రబాబు : నేను అడిగినప్పుడు నీవు ఆపరేట్‌ చేయి.
రాధాకృష్ణ : ప్యాకేజీ ఇంకా మొదలు కాలేదుగా.
వేరే వ్యక్తి : మొదలు కాలేదు సర్‌.
రాధాకృష్ణ :ఎన్టీఆర్‌ ఆరోగ్యశ్రీ అనే ఉందా పేరు?
చంద్రబాబు : వాడి పేరు మార్చాలి.. మారుస్తున్నా..
రాధాకృష్ణ : మొన్న చెప్పింది ఇదే. దాన్ని టోటల్‌గా రీవ్యాంప్‌ చేయాలి. దానికి భారీగా మన మీడియాలో పబ్లిసిటీ ఇచ్చేద్దాం.
చంద్రబాబు : మార్చేస్తున్నా. వేరే పేరు మార్చేస్తున్నా. వాడి పనై పోయింది (ఎన్టీఆర్‌ను ఉద్దేశించి)
రాధాకృష్ణ : ఆ ఓకే.
చంద్రబాబు : ఎన్టీఆర్‌… పేరు మార్చాలి.
రాధాకృష్ణ : దానిని వేరే పేరు మార్చాలి. దానిని యూనివర్సల్‌ హెల్త్‌ స్కీమ్‌ చేస్తున్నారు కదా. పేరు మార్చేద్దాం. పబ్లిసిటీ బాగా ఇద్దాం. రీవ్యాంప్‌ చేద్దాం.
ఈలోగా టెక్నికల్‌ వారితో సంభాషణ ఏ సబ్జెక్టులు ఉన్నాయి. వైజాగ్‌లో ఏమి పెట్టారు. వైజాగ్‌లో ఎల్‌ఈడీ…తదితర అంశాలున్నాయి.