Home / MOVIES / మహర్షి మూవీ రీలీజ్ డేట్ వచ్చేసింది..!

మహర్షి మూవీ రీలీజ్ డేట్ వచ్చేసింది..!

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన అగ్రహీరో,టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా యంగ్ అండ్ డైనమిక్ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో లేటెస్ట్ గా తెరకెక్కుతున్న మూవీ మహర్షి. అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. అయితే మహేష్ బాబు కేరీర్లోనే ఇరవై ఐదో మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుంది.

పోస్టు ప్రోడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం మే నెల తొమ్మిదో తారీఖున విడుదల కానున్నట్లు చిత్రం యూనిట్ ప్రకటించింది.అగ్రనిర్మాతలు దిల్ రాజు, అశ్వినీదత్ , పీవీపీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోన్నారు.ప్రముఖ సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. ఈ మూవీలో ప్రిన్స్ మహేష్ బాబుకు దోస్తుగా ప్రముఖ నటుడు అల్ల‌రి న‌రేష్ తొలిసారిగా న‌టిస్తున్నారు.