Home / ANDHRAPRADESH / టీడీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..

టీడీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..

ఏపీలో ఈ నెల పదకొండు తారీఖున ఇటు అసెంబ్లీ ఎన్నికలు అటు పార్లమెంట్ ఎన్నికలు జరిగిన సంగతి తెల్సిందే. ఈ ఎన్నికల్లో మొత్తం ఎనబై శాతం వరకు పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో తాము గెలుస్తామని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ.. కాదు మేము గెలుస్తామని అధికార టీడీపీ నేతలు ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తోన్నారు.

ఈ క్రమంలో ఎవరికి వారు పలు సర్వేలు నిర్వహించి మేమంటే మేము గెలుస్తామని ప్రకటించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటు ఏపీ అయిన అటు తెలంగాణ రాజకీయాలు అయిన కానీ ఉన్నది ఉన్నట్లు మాట్లాడే నేత టీడీపీ తాజా మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. ఆయన ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ”ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ సర్కారు నూట మూడుకు పైగా పథకాలను ప్రవేశ పెట్టి అమలుచేసింది. అయితే ఇవేమి టీడీపీని,చంద్రబాబును కాపాడలేవు కానీ ఇటీవల మహిళలకోసం తీసుకువచ్చిన పసుపు-కుంకమ,ఆసరా పించన్లు మాత్రమే కాపాడతాయని ఆయన కుండ బద్ధలు కొట్టినట్లు చెప్పేశారు.

అంతే కాకుండా ఆయన ఇంకో అడుగు ముందుకేసి అనంతపురం పార్లమెంట్ ఎన్నికల్లో సుమారు యాబై కోట్ల వరకు ఖర్చు అయినట్లు కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేసినట్లు ప్రసారం జరుగుతుంది. అయితే జేసీ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ఉన్నది ఉన్నట్లు చెప్పే జేసీ ప్రస్తుత ఎన్నికల్లో గెలవడానికి టీడీపీ కోట్లు ఖర్చు చేసిందని ఒప్పుకున్నాడని సెటైర్లు వేస్తోన్నారు నెటిజన్లు..