Home / ANDHRAPRADESH / వైసీపీ దేశంలోనే తొలిస్థానం ఇండియా టుడే స‌ర్వే..

వైసీపీ దేశంలోనే తొలిస్థానం ఇండియా టుడే స‌ర్వే..

ఏపీలో ఎప్రిల్ 11న జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మునుపెన్న‌డూ లేని విధంగా పోలింగ్ శాతం న‌మోదైన సంగ‌తి తెలిసిందే. అయితే పోలింగ్ శాతం ఎక్కువగా పెరగడంతో అన్ని పార్టీలకు మరింత టెన్సన్ పెరిగింది. అయితే ఏపీలో జరిగిన ఎన్నికలపై అన్ని సర్వేల్లోనూ వైసీపీ ఫ్యాన్ గాలే వీస్తుందని తెలిపాయి. జాతీయ స్థాయిలో విశ్వసనీయత గల నేషనల్ మీడియా ఇండియా టుడే సర్వే కూడా జగన్ కే జై కొట్టింది. కొన్ని నెలల ముందు కూడ వైసీపీ అధినేత వైఎస్ జగన్ గ్రాఫ్ మరింత పెరిగిందని చెప్పింది. తాజాగా ప్రతి పక్షంలో ఉన్న వైసీపీ, అధికారంలో ఉన్న టీడీపీ త‌ర‌పున పోటీ చేసిన అభ్య‌ర్థుల చ‌దువు, వివ‌రాల‌పై ఇండియాటుడే గ్రూప్‌న‌కు చెందిన ఇండియాటుడే గ్రూప్ ఇంటిలిజెన్స్ స‌ర్వే చేసినట్లు తెలుస్తుంది. జరిగిన ఎన్నిక‌ల్లో దేశ‌వ్యాప్తంగా పోటీ చేసిన ప‌లు రాజకీయ పార్టీల అభ్య‌ర్థుల చ‌దువు, అర్హ‌త‌ల‌పై ఈ సర్వే జ‌రిగింది. ఈ స‌ర్వేలో ఏం తేలిందంటే వైసీపీ దేశంలోనే తొలిస్థానంలో నిలిచినట్లు ఇండియా టుడే గ్రూపు తెలిపినట్లు సమచారం. వైసీపీ నుంచి ఏపీలో పోటీ చేసిన ఎంపీ క్యాండెట్స్‌లో 88 శాతం మంది అభ్య‌ర్థులు డిగ్రీ లేదా అంత‌కంటే ఎక్కువ చ‌దువులు చ‌దువుకున్నార‌ని ఆ సర్వ తెలియజేసిందంట.
రెండవ స్థానం..డీఎంకే
మూడోస్థానం అన్నాడీఎంకే
నాలుగో స్థానం తెలంగాణా
మొత్తం లోక్ సభ ఎన్నికల్లో ఈసారి 139 మంది నిరక్షరాస్యులు పోటీలో ఉన్నట్లు ఈ స‌ర్వే స్ప‌ష్టం చేసింది. ఇక దేశంలోనే ఎంతోమందికి రాజ‌కీయాలు నేర్పాన‌ని చెప్పుకునే చంద్ర‌బాబు అధ్య‌క్షుడిగా ఉన్న టీడీపీ ప్ర‌స్తావ‌నే ఈ స‌ర్వేలో లేదు.అంటే చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయం అంటే ఇదేనేమో అనుకుంటున్నారు అందరు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat