Home / ANDHRAPRADESH / ఓటమిని ఒప్పుకున్న టీడీపీ మంత్రి..!

ఓటమిని ఒప్పుకున్న టీడీపీ మంత్రి..!

ఏపీ అధికార టీడీపీకి చెందిన నేత ,రాష్ట్రంలో నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి కొణకళ్ల నారాయణ నిజమే చెప్పడానికి ప్రయత్నించినట్లు కనబడింది. ఆయన మీడియాతో మాట్లాడుతూ తన ప్రత్యర్థి బలవంతుడని, ఎప్పుడూ ప్రజల్లో ఉంటాడని, అయినా ఎదుర్కొన్నాను.

ఏం జరుగుతుందో చూద్దామంటూ ఆయన వ్యాఖ్యానించారు. మళ్లీ టీడీపీ ప్రభుత్వం వస్తుందో లేదో ఆయన స్పష్టంగా చెప్పకపోగా నెల్లూరు జిల్లాలో పార్టీ ఎన్ని సీట్లు వస్తాయనే దానికి స్పష్టంగా జవాబివ్వకుండా వెళ్లిపోయారు.

అయితే మంత్రి నారాయణ వ్యాఖ్యలపై రాజకీయ విశ్లేషకులు స్పందిస్తూ “తనకు ప్రత్యర్థి అయిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ గెలుస్తున్నాడు. తను ఓడిపోబోతున్నాని మంత్రి నారాయణ చెప్పక చెప్పారు “అని వ్యాఖ్యానిస్తున్నారు.