Home / 18+ / ఎగ్జిట్ పోల్స్ విషయంలో చంద్రబాబు కామెంట్లు వింటే షాకవ్వాల్సిందే

ఎగ్జిట్ పోల్స్ విషయంలో చంద్రబాబు కామెంట్లు వింటే షాకవ్వాల్సిందే

తాజాగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై జాతీయ మీడియా సహా ఇతర చానెళ్లు, పలు సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ను ప్రకటించాయి. వైసీపీకి 110-125 అసెంబ్లీ స్థానాలు వచ్చే అవకాశముందని, టీడీపీకి 54-60 సీట్లు వస్తాయని దాదాపుగా ఇదే సంఖ్యలో అన్ని సర్వేలు వచ్చాయి. అలాగే దాదాపుగా 20 ఎంపీలు వైసీపీకి, ఐదు ఎంపీలు టీడీపీకి వస్తాయని తేలింది. ఈ ఫలితాలు చంద్రబాబుకు దిమ్మతిరిగేలా చేసాయి. ఈ నేపధ్యంలో చంద్రబాబు దీనిపై స్పందించారు. ప్రజల నాడి పట్టుకోవడంలో ఎగ్జిట్ పోల్స్ విఫలమయ్యాయని అతి పెద్ద జోక్ పేల్చేసారు.. నిన్న ఢిల్లీ నుంచి చంద్రబాబు గన్నవరం చేరుకున్నారు.

ఈసందర్భంగా మీడియాతో చంద్రబాబు మాట్లాడుతూ చాలాసార్లు ఎగ్జిట్ పోల్స్ లెక్కలు వాస్తవానికి దూరంగా వచ్చాయన్నారు. ఏపీలో తెలుగుదేశం అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు. టీడీపీ గెలుపుపై తనకు అనుమానాలు లేవన్నారు. కేంద్రంలో నాన్ బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ వచ్చాక కూడా చెప్తుండడం చూసి అక్కడి విలేఖర్లే ఆశ్చర్యపోయారు. ఈవీఎంలకు, వీవీ ప్యాట్ల లెక్కింపునకు ఏమాత్రం తేడా వచ్చినా ఆ నియోజకవర్గంలో పూర్తిగా వీవీ ప్యాట్లు లెక్కించాలని డిమాండ్ చేస్తూ పాతపాటనే అందుకున్నారు.