Home / 18+ / భాగ్యనగరంలో “మన్మధుడు 2” టీమ్..!

భాగ్యనగరంలో “మన్మధుడు 2” టీమ్..!

కింగ్ నాగార్జున,రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘మన్మధుడు2’.ఈ చిత్రం నెలరోజులు పాటు షూటింగ్ పోర్చుగ‌ల్‌లో జరిగిన విషయం అందరికి తెలిసిందే.ఈ మేరకు సోషల్ మీడియాలో కొన్ని ఫొటోస్ కూడా పెట్టడం జరిగింది.ఇందులో వెన్నెల‌కిషోర్‌, రావు ర‌మేష్ తదితరలు నటిస్తున్నారు.రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం వస్తుండగా..అక్కినేని నాగార్జున, పి.కిర‌ణ్ నిర్మిస్తున్నారు.చైత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.ప్రస్తుతం చిత్ర యూనిట్ పోర్చుగ‌ల్‌లో షూటింగ్ పూర్తి చేసుకుంది.త్వరలో హైదరాబాద్ లో షూటింగ్ చేయనున్నారు.మన్మధుడు చిత్రం ఎంత హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.అదే సీక్వెన్స్ లో ఇప్పుడు ‘మన్మధుడు2’ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రానుంది.