Home / SLIDER / అభ్యర్థి తలరాతను మార్చిన “ఒక్క ఓటు”

అభ్యర్థి తలరాతను మార్చిన “ఒక్క ఓటు”

తెలంగాణలో విడుదలైన పరిషత్ ఎన్నికల్లో ఒక్క ఓటు అభ్యర్థుల తలరాతను మార్చింది. విషయానికి వస్తే  నల్లగొండ జిల్లా పీఏపల్లి మండలం అజ్మాపురం ఎంపీటీసీ స్థానానికి టీఆర్‌ఎస్ తరపున పోటీ చేసిన గుండాల నాగమణి ఒక్క ఓటుతో గెలిచారు. అదేవిధంగా  కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం రుద్రారం ఎంపీటీసీగా పెద్దెడ్ల నర్సింలు (కాంగ్రెస్) ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. పెద్దెడ్ల నర్సింలుకు 890 ఓట్లు రాగా, సమీప అభ్యర్థి పాపిగల్ల సాయిలుకు 889 ఓట్లు రావడంతో రెండోసారి ఓట్లు లెక్కించారు. అయినా ఒక్క ఓటుతో పెద్దెడ్ల నర్సింలునే విజయం వరించింది.