సినీ నటుడు శివాజీ ఇప్పుడెక్కడున్నాడన్న విషయంపై ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి. టీడీపికి అనకూలంగా మారి గరుడ పురాణం వినిపించి సంచలనం రేకెత్తించి ఇప్పుడు గరుడ పురాణానికి బదులుగా గుండు పురాణం ఎత్తుకుని చల్లగా జారుకున్నారా? అన్న కోణంలో సాగుతున్న విశ్లేషణలు నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీకి ఏం చేశాడో అందరికి తెలుసు. అయితే ఎన్నికల్లో తాను టార్గెట్ చేసిన వైసీపీ అఖండ మెజార్టీతో గెలిచింది. ఇకపోతే టీవీ 9 రవిప్రకాశ్ కు అనుకూలంగా వ్యవహరించి అడ్డంగా బుక్కై శివాజీ పరిస్థితి ఇప్పుడు అత్యంత ప్రమాదకరంగా ఉంది‘ఆపరేషన్ గరుడ’ పేరిట హడావుడి చేసిన గరుడ శివాజీ టీవీ9 వాటా అమ్మకపు అక్రమాల వ్యవహారాల్లో టీవీ9 కొత్త యాజమాన్యం అలందమీడియా రవి ప్రకాష్ తో పాటు శివాజీపైన కూడా కేసు పెట్టింది. దీంతో రవి ప్రకాష్ తో పాటు గరుడ శివాజీ కూడా అజ్జాతంలోకి వెళ్లిపోయారు. రవి ప్రకాష్ స్వయంగా పోలీసుల వద్ద లొంగిపోయారు. పలుమార్లు విచారణకు హాజరయ్యారు. కానీ గరుడ శివాజీ ఆచూకీ మాత్రం కనిపించలేదు. తాజాగా కొత్త అవతారంలో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చార్లీచాప్లిన్ ఆహార్యంతో మీసాలు చిన్నగా ట్రిమ్ చేసుకుని కనిపించే వీడియో ఒకటి ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. దీంతో ఏముంది నెటిజన్ల్ కామెంట్లతో రెచ్చిపోతున్నారు. ఇక వైసీపీ అభిమానులయితే ఇంకొంచెం మసాలా తోడు చేసి పోలీసులు గుర్తుపట్టకుండా ఆపరేషన్ గరుడ’అపరేషన్ చేయించుకున్నాడా అంటున్నారు.
