మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.ఫ్యాన్ గాలికి రాష్ట్రంలో ఉన్న తెలుగు తమ్ముళ్ళు అందరు అతలాకుతలం అయ్యారు.ఐదేళ్ళు టీడీపీ పాలనకు విసిగిపోయిన ప్రజలు జగన్ ను అఖండ మెజారిటీ తో గెలిపించి టీడీపీ సరైన బుద్ధి చెప్పారు.దీని ఫలితమే వైసీపీ ఏకంగా 151అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది.టీడీపీ కేవలం 23
స్థానాలతో సరిపెట్టుకుంది.అంతేకాకుండా ఎంపీల విషయానికి వస్తే వైసీపీ 22సీట్లు గెలుచుకొని దేశంలోనే ఎక్కువ సీట్లు గెలుచుకున్న జాబితాలో మూడో స్థానంలో నిలిచింది.ఇక సాలు విషయానికి వస్తే వైసీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదని,వారికి జగన్ ఎల్లప్పుడూ తోడుగా ఉంటారని దీనికి ఉదాహరణ నేనేనని మంత్రి మోపిదేవి వెంకటరమణ చెప్పారు.ఎమ్మెల్యే గా ఓడిపోయిన నన్ను మంత్రిని చేసారని అన్నారు.విశాఖలో జరిగిన పార్టీ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ ఇలా అన్నారు.ఈ మీటింగ్ కు ఓడిపోయిన ఎమ్మెల్యేలు,నాయకులు అందరు హాజరయ్యారు.
