Home / SLIDER / అమ్మ‌వారికి ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించిన మంత్రులు అల్లోల‌, త‌లసాని

అమ్మ‌వారికి ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించిన మంత్రులు అల్లోల‌, త‌లసాని

ఆషాఢ మాసం బోనాల ఉత్సవాల్లో భాగంగా గోల్కొండ జగదాంబిక మహాకాళి బోనాలు ఘ‌నంగా ప్రారంభ‌మ‌య్యాయి. ఉత్సవాల్లో భాగంగా లంగర్‌హౌజ్‌ చౌరస్తా నుంచి ప్రారంభ‌మైన‌ బోనాల ఊరేగింపు లో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, సినీమాటోగ్రఫీ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస‌యాద‌వ్ పాల్గొన్నారు. అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరుఫున మంత్రులు పట్టు వస్ర్తాలు సమర్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆలయం ఈవో మహేందర్‌కుమార్ , బోనాల ఉత్సవాల నిర్వహణ కమిటీ చైర్మన్‌ గోపిరెడ్డి వసంత్‌రెడ్డి, సభ్యులు, అధికారులు, పాల్గొన్నారు.