Breaking News
Home / 18+ / జక్కంపూడి రాజాను సొంత తమ్ముడిగా చూసుకున్న జగన్.. వైఎస్ కూడా ఇదేనేర్పారు

జక్కంపూడి రాజాను సొంత తమ్ముడిగా చూసుకున్న జగన్.. వైఎస్ కూడా ఇదేనేర్పారు

గతంలో విష జ్వ‌రాల కార‌ణంగా తూర్పు గోదావ‌రి జిల్లా ఏజెన్సీలో ప‌లువురు మ‌ర‌ణించారు.. దాదాపుగా రెండేళ్లక్రితం జరిగిందీ సంఘటన.. ఆసమయంలో బాధిత కుటుంబాల్ని ప‌రామ‌ర్శించేందుకు అప్పటి విప‌క్ష నేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లాలోని మారుమూల గ్రామం చాప‌రాయికి బ‌య‌లుదేరారు. చాప‌రాయికి చేరుకోవ‌టం అంత తేలికైన ప‌ని కాదు. ఏజెన్సీలోని గిరిజ‌నుల ద‌గ్గ‌ర‌కు చేరుకోవ‌టానికి స‌రైన దారిలేదు. ఆదారుల్లో బొలేరో, క‌మాండ‌ర్ జీపులు మాత్ర‌మే వెళ‌తాయి. అయితే రూట్ మీద  అవ‌గాహ‌న లేక‌నో.. మ‌రీ అంత దారుణంగా ఉంటాయ‌ని తెలియకో జ‌గ‌న్ తో పాటు బ‌య‌లుదేరిన నేత‌లంతా రెగ్యుల‌ర్ వాహ‌నాల్ని తీసుకొచ్చారు. ఘాట్ రోడ్డులో దాదాపుగా ఏడు కిలోమీట‌ర్లు ప్ర‌యాణించిన త‌ర్వాత చాప‌రాయి వ‌స్తుంది.

ఈ రోడ్డులో వాహ‌నాలు న‌డ‌పాలంటే ప్ర‌త్యేక అనుభ‌వం ఉండాలి. పైగా స్థానికంగా ఉండే రంప‌చోడ‌వ‌రం మారేడుమిల్లికి చెందిన స్థానిక డ్రైవ‌ర్ల‌కే అది సాధ్యం. వాహ‌నాన్ని కొండ‌పైకి ఎక్కించ‌డం, అదే స‌మ‌యంలో లోయ‌లోకి వాహ‌నం జారిపోకుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవడం చేయాలి.. ప్రయాణం చాలా కష్టం.. కానీ జగన్ ఇదేమీ పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు.. కచ్చితంగా వెళ్లాలంటున్నారు.. జ‌గ‌న్ తో పాటు బ‌య‌లుదేరిన నేత‌లంతా త‌మ వాహ‌నాల్ని తీసుకెళ్ల‌లేక మ‌ధ్య‌లోనే ఆగిపోయారు.. పోనీ మరోసారి ప్లాన్డ్ గా వెళ్దాం అంటే జగన్ వినడం లేదు.. దారుల సంగతి అలా ఉంచితే మావోయిస్టు ప్రభావిత ప్రాంతం.. దట్టమైన అడవులు.. కమ్యూనికేషన్ వ్యవస్థ లేదు.. అలాంటిచోటికి జగన్ ప్రయాణించడం వైసీపీ శ్రేణులను కూడా ఉత్కంఠకు గురి చేసింది.

కనీసం జగన్‌ బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా ముందుకు సాగలేదు. దీంతో అప్పటికప్పుడు పోర్‌వీల్‌ డ్రైవ్‌ వెహికల్‌ను రప్పించారు. అయితే దానికి బుల్లెట్ ఫ్రూప్ రక్షణ లేకపోవడంతో పోలీసులు అంగీకరించలేదు. కానీ వారికి సర్దిచెప్పి జగన్‌ ముందుకెళ్లారు. ఇంత రిస్కీ ఏరియాలో జగన్‌ కారు నడపడానికి ఎవరూ లేరు.. అయితే జగన్‌ను పక్కన కూర్చోబెట్టుకుని కారు నడపడం తన డ్రీమ్ అని దీనికి జగన్ ని ఒప్పుకోవాలని రాజా కోరారు. జగన్‌ వెంటనే ఒప్పుకున్నారు. ఏజెన్సీలో నడపగలవా అని ప్రశ్నించగా నడపుతానన్నా అని చెప్పి బయలుదేరారు. అలా జగన్ బుల్లెట్ ఫ్రూఫ్ వాహనం లేకుండానే ఏజెన్సీలో ప్రయాణించి చాపరాయికి చేరుకున్నారు.

కట్ చేస్తే రెండేళ్లకు అదే రాజాకు రాజానంగరం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు.. ఆయన గెలిచి ఎమ్మెల్యు అవడంతో పాటు తాజాగా కాపు కార్పొరేషన్‌ రాష్ట్ర చైర్మన్‌గా నియమితులయ్యారు. రాజమహేంద్రవరానికి చెందిన రాజా మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు తనయుడు ఈయన తాజా జరిగిన ఎన్నికల్లో రాజానగరం నుంచి విజయం సాధించారు. 1988 అక్టోబరు 5న జన్మించిన రాజా ఎంబీబీఎస్‌ మధ్యలో ఆపేశారు. వైసీపీ ఏర్పడినప్పటి నుంచి ఆయన జగన్‌ వెంటే ఉంటున్నారు. ఆయన తండ్రి రామ్మోహనరావు వైఎస్‌ రాజశేఖరెడ్డికి ముఖ్య అనుచరుడు. రాజా గత నాలుగేళ్లుగా వైసీపీ యూత్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయనకు కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి ఇస్తూ సీఎం జగన్‌ నిర్ణయం తీసుకోవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది