Breaking News
Home / 18+ / ఈ పిక్స్ తో ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరికినట్టే..?

ఈ పిక్స్ తో ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరికినట్టే..?

సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఒక అద్భుతం బాహుబలి..ఈ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీ ప్రఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి జక్కన్న. ఈ చిత్రం కోసం యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఐదు సంవత్సరాలు ఈ సినిమాకే అంకితం ఇచ్చాడు. ఈ సినిమాతో ఒక్కసారిగా ప్రభాస్ ఫేమ్ మొత్తం మారిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే వీరిద్దరూ స్నేహితులుగా బాగా కలిసిపోయారు. అయితే ఈ చిత్రం తరువాత రెండు సంవత్సరాల భారీ గ్యాప్ తీసుకొని సాహో తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ప్రభాస్. ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహించాడు. భారీ బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగష్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే ఈ చిత్ర ఫస్ట్ లుక్, సాంగ్ కూడా రిలీజ్ అయ్యింది. దీనిపై అగ్ర హీరోలు సైతం ప్రభాస్ కు విష్ చేయడం జరిగింది కాని రాజమౌళి మాత్రం ఏ విధంగాను స్పందించలేదని సోషల్ మీడియాలో ఏవేవో కధనాలు నడిచాయి. అయితే మొన్న జరిగిన సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజమౌళి కూడా వచ్చాడు. జక్కన్న స్పీచ్ తో ఆ వార్తలు అన్ని తుడిచికొట్టుకుపోయాయని తెలుస్తుంది. వారిద్దరి పిక్స్ తో ఎవరికైనా క్లియర్ గా అర్ధమవుతుంది.. వారి మధ్య ఉన్న స్నేహమేంటో.