Home / ANDHRAPRADESH / కరెంటు స్తంభమెక్కిన వైసీపీ ఎమ్మెల్యే..!

కరెంటు స్తంభమెక్కిన వైసీపీ ఎమ్మెల్యే..!

వినడానికి నమ్మశక్యంగా లేకపోయిన ఇదే నిజం.. నవ్యాంధ్ర అధికార పార్టీ వైసీపీకి చెందిన గుంటూరు తూర్పు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా విద్యుత్ స్తంభం ఎక్కారు. జిల్లా కేంద్రంలో విద్యుత్ భవన్లో గ్రామ,సచివాలయాల్లో జూనియర్ లైన్మెన్ గ్రేడ్-2 పోస్టులకు అభ్యర్థులను ఎంపికలో భాగంగా నిన్న మంగళవారం స్క్రీనింగ్ టెస్ట్ జరిగింది.

ఈ టెస్టులో భాగంగా అభ్యర్థులు విద్యుత్ స్థంభాలు ఎక్కాలి. అయితే స్తంభాలు ఎక్కేక్రమంలో తీవ్ర ఒత్తీడికి లోనయ్యారు అభ్యర్థులు.

ఇది అంతా మొదటి నుండి గమనిస్తోన్న ఎమ్మెల్యే ముస్తఫా అభ్యర్థుల్లో మనోధైర్యం నింపాలనే లక్ష్యంతో తాను స్తంభం ఎక్కుతూ ఎటువంటి ఒత్తిడి .. భయం లేకుండా ఎలా ఎక్కాలో సవివరంగా వివరిస్తూ తాను స్తంభం ఎక్కుతూ అందర్నీ ఆశ్చర్యపరిచారు.దీంతో అక్కడున్నవారు ఎమ్మెల్యేపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆ తర్వాత అభ్యర్థులు ఎటువంటి భయం బెరుకు లేకుండా స్తంభాలెక్కడం గమనార్హం.