Breaking News
Home / 18+ / సాహో వన్ వీక్ కలెక్షన్స్..రికార్డ్ బ్రేక్ !

సాహో వన్ వీక్ కలెక్షన్స్..రికార్డ్ బ్రేక్ !

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన చిత్రం ‘సాహో’ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుంది. ఆగష్టు 30న విడుదలైన ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ సుజీత్ తీసాడు. సుమారు 350కోట్ల భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, మలయాళంలో తెరకెక్కించారు. ఈ చిత్రం స్టొరీ పరంగా ఎవరికీ అంతగా నచ్చకపోయినా కలెక్షన్లు పరంగా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుంది. వారంరోజుల్లో వరల్డ్ వైడ్ కలెక్షన్స్ చూసుకుంటే 370 కోట్లకు పైమాటే. ఇదే ఊపూ కొనసాగితే 500 కోట్ల మార్క్ ని క్రాస్ చేస్తుంది అనడంలో సందేహమే లేదు.