ప్రస్తుతం తెలుగులో హాట్ హాట్ గా నడుస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ 3. అక్కినేని నాగార్జున ఈ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇక హౌస్ లోకి వెళ్తే ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో అందరు అనుకున్నట్టుగానే అలీ రాజా ఎలిమినేట్ అయ్యాడు. అయితే ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం బిగ్ బాస్ పై బయట ఒక పుకారు ఫాస్ట్ గా వైరల్ అవుతుంది. అదేమిటంటే హౌస్ లో ఉన్న శివ జ్యోతితో ఎవరైతే బాగా స్నేహం చేస్తారో వారు ఎలిమినేట్ అవుతారని దీనికి ఉదాహరణగా కొన్ని ఫొటోస్ పెట్టి సోషల్ మీడియా లో స్క్రోల్ చేస్తున్నారు. శివ జ్యోతితో స్నేహం చేసిన రోహిణి, ఆశు రెడ్డి హౌస్ నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. ఇక ఈ మధ్య ఎక్కువగా అలీ కూడా తనతో స్నేహం చేస్తున్నట్టు కనిపించాడు. దాని రిజల్ట్ నిన్న ఎలిమినేట్ అయ్యాడు.