Home / 18+ / త్రివిక్రమ్ బర్త్ డే ట్రీట్..బన్నీ ఫ్యాన్స్ కు పండగే !

త్రివిక్రమ్ బర్త్ డే ట్రీట్..బన్నీ ఫ్యాన్స్ కు పండగే !

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కలయికలో వస్తున్న చిత్రం అల వైకుంఠపురంలో.ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవలే ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అది అప్పట్లో ఫుల్ వైరల్ అయ్యింది. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం త్రివిక్రమ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్ ఇస్తున్నాడట. అదేమిటంటే నవంబర్ 7 త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర టీజర్ రిలీజ్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తుంది. ఇందులో బన్నీ కి జంటగా మహర్షి హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తుంది. మరి మాటల మాంత్రికుడు ఫ్యాన్స్ కు ట్రీట్ ఇస్తాడా లేదా అనేది వేచి చూడాల్సిందే.