Home / MOVIES / శ్రీముఖికి షాకిచ్చిన యాంకర్ రవి… ఆట బాగోలేదా..నచ్చలేదా..!

శ్రీముఖికి షాకిచ్చిన యాంకర్ రవి… ఆట బాగోలేదా..నచ్చలేదా..!

యూత్ బాగా మెచ్చిన, పాపులర్ అయిన షోలలో యాంకర్ రవి, శ్రీముఖి హోస్ట్ చేస్తున్న ‘పటాస్’ అని  చెప్పుకోవచ్చు. అయితే ఈ షో నుంచి శ్రీముఖి తప్పుకోవడంతో షో గ్లామర్ తగ్గిందని చాలా మంది అంటున్నారు. వీరిద్దరి జోడిగా చేసే యాంకరింగ్ కు చాలా మంది అభిమానులు ఉన్నారు. అయితే శ్రీముఖికి బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఏంట్రీ ఇచ్చింది. దీంతో గ్లామర్ తగ్గింది. అయితే బిగ్‌బాస్‌ హౌస్‌లో కంటెస్టెంట్లు ఎలా ఆడినా.. కొందరు వారిని వ్యక్తిగతంగా ఇష్టపడితే.. మరికొందరు ఆటను ఆడే విధానాన్ని బట్టి ఫాలో అవుతూ ఉంటారు. సెలబ్రెటీలు సైతం బిగ్‌బాస్‌ను ఫాలో అవ్వడమే కాకుండా నచ్చిన కంటెస్టెంట్ల తరుపున మద్దతును ప్రకటిస్తారు. ఇప్పటికే పలు సీరియల్‌ యాక్టర్స్‌ కొంతమంది కంటెస్టెంట్ల తరుపున ప్రచారం చేస్తున్నారు. ఇదే విధంగా యాంకర్‌ రవి.. తనకు ఇష్టమైన కంటెస్టెంట్ల పేర్లను చెప్పడంతో సోషల్‌ మీడియా వేదికగా శ్రీముఖికి సెటైర్లు పడుతున్నాయి. ఆలీరెజా మళ్లీ వైల్డ్ కార్డ్ ఏంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లితే బాగుటుంది. అతనే నాకు ఇష్టమైన వాడు అంటూ ..బిగ్ బాస్ ను అంతగా ఫాలో అవ్వడంలేదు గాని బాబా భాస్కర్..రాహుల్..వరుణ్ గురించి మంచిగా వినిపిస్తోందని ఓ వీడియో ద్వారా చెప్పాడు. దీంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతున్నది. శ్రీముఖి..రవి కో యాంకర్ గా ఎన్నో షోస్ చేసి, వ్యక్తిగంతగానూ ఎంతో తెలిసిన వ్యక్తి అయిన యాంకర్ రవి తనకు ఇష్టమైన వ్యక్తిగా శ్రీముఖి పేరు చెప్నలేదంటూ శ్రీముఖి అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అంటే శ్రీముఖి ఆట నచ్చలేదా,బాగోలేదా అంటూ రియాక్ట్ అవుతున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat