Home / SLIDER / నేనున్నాను..

నేనున్నాను..

తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఈ క్రమంలో తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఇద్దరు చిన్నారులకు అండగా నిలిచారు మంత్రి కేటీఆర్. సికింద్రాబాద్ పరిధిలో కవాడిగూడకు చెందిన పద్నాలుగేళ్ల బాలుడు సునీల్ సరిగ్గా 3ఏళ్ల కింద వచ్చిన తీవ్ర జ్వరంతో బ్రెయిన్ స్ట్రోక్ కు గురవ్వడంతో మంచానికే పరిమితమయ్యాడు.

ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో నెల నెల ఖర్చులకు సర్కారు తరపున ఆర్థిక సాయమందించడమే కాకుండా వికలాంగుల పింఛన్ అందేలా ఆధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు.

మరోవైపు నారాయణ గూడకు చెందిన పదవ తరగతి చదువుతున్న డీ మైత్రీ తీవ్ర అనారోగ్యానికి గురవ్వడంతో ఆపరేషన్ కు ఐదు లక్షలదాక అవసరమని వైద్యులు చెప్పడంతో ఆ అర్థిక సాయన్ని కూడా ప్రభుత్వం తరపున అందజేస్తామని మంత్రి భరోసానిచ్చారు.