Home / SLIDER / మూడేళ్ల కల సాకారం

మూడేళ్ల కల సాకారం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని ప్రభుత్వం రైతన్నల ఎన్నో దశాబ్ధాల కల అయిన కాళేశ్వరం ప్రాజెక్టును మూడేళ్లల్లోనే పూర్తిచేసిన సంగతి విదితమే.

ఈ క్రమంలో కాళేశ్వర జలాలు వరద కాలువల ద్వారా రివర్స్ పంపింగ్ స్టైల్లో ఎస్సారెస్పీకి చేర్చే ట్రయిల్ రన్ సక్సెస్ అయింది. రాష్ట్రంలోని ఇందూరు జిల్లా బాల్కొండ వద్ద ఉన్న వరద కాలువ నీళ్ళు శ్రీరాంసాగర్ గేట్లను చేరుకుంది.

అక్కడ నుంచి శ్రీరాంసాగర్ నింపే ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ మూడేళ్ల క్రితం శంకుస్థాపన చేశారు. 200 కి.మీ దిగువన ఉన్న గోదావరి జలాలు కాళేశ్వరం ద్వారా శ్రీరాంసాగర్ ను తాకడంతో జిల్లాకు చెందిన రైతులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తోన్నారు.