Breaking News
Home / 18+ / సాహో కు 40కోట్లు వరకు నష్టం..అలెర్ట్ అయిన సైరా !

సాహో కు 40కోట్లు వరకు నష్టం..అలెర్ట్ అయిన సైరా !

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన చిత్రం సాహో.ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించారు. సాహో ఆగష్టు 30న నాలుగు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి గాను సుమారు 350కోట్లు వెచ్చించారు. తెలుగు రాష్ట్రాల్లో అనుకున్న స్థాయిలో సినిమా రాణించలేదు. కాని సినిమా మాత్రం కలెక్షన్లు విషయంలో భారీగా రాబట్టింది. ఇక అసలు విషయానికి వస్తే తెలుగులో సాహో మొత్తమీద 120 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేయగా టోటల్ రన్ లో 80 కోట్లు మాత్రమే వసూలు చేసేలా ఉంది. ఇదే సినిమా హిందీలో అయితే సూపర్ హిట్ అవ్వడమే కాకుండా కలెక్షన్లు కూడా రికార్డులు సృష్టిస్తున్నాయి. ఈ సినిమా తరువాత వస్తున్న మరో భారీ బడ్జెట్ చిత్రం ‘సైరా’. సాహో పై పడిన దెబ్బ సైరా పై పడకుండా ఉండాలి అంటే చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. దాంతో చిత్ర యూనిట్ కూడా కొంచెం అలెర్ట్ అయ్యిందని సమాచారం.