Home / 18+ / జక్కన్న రివ్యూ కోసమే ఎదురుచూపులు…ఏం చెబుతారో ?

జక్కన్న రివ్యూ కోసమే ఎదురుచూపులు…ఏం చెబుతారో ?

న్యాచురల్ స్టార్ నాని, ప్రియాంక జంటగా నటించిన చిత్రం గ్యాంగ్ లీడర్. ఈ చిత్రానికి గాను విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించారు. నిన్న అనగా సెప్టెంబర్ 13న విడుదలైంది. ఇక అసలు విషయానికి వస్తే బాహుబలి డైరెక్టర్ రాజమౌళి, హీరో నాని మధ్య ఉన్న సంభందం ఎలాంటిదో అందరికి తెలిసిందే. ఈగ సినిమాతో వీరిమధ్య ఆ బంధం బాగా ఏర్పడింది. ఇంకా చెప్పాలి అంటే వారు ఫ్యామిలీ లా ఉంటారు. రాజమౌళి ఎంత బిజీ షెడ్యూల్ లో ఉన్నప్పటికీ తన భార్యతో కలిసి శుక్రవారం నాడు ప్రసాద్ ఐమాక్స్ లో సినిమా చూసాడు. అయితే జక్కన్న ఏ సినిమా చూసినా మరుసటిరోజు తన ట్వీట్ ద్వారా రివ్యూ ఇస్తాడు. మరి ఈ సినిమాకు ఇలాంటి రివ్యూ ఇస్తాడో చూడాల్సిందే.