Home / MOVIES / బిగ్‌బాస్‌ నుంచి బయటకు వచ్చిన శిల్పా ..శ్రీముఖి అవకాశవాది అంటూ షాకింగ్ కామెంట్స్

బిగ్‌బాస్‌ నుంచి బయటకు వచ్చిన శిల్పా ..శ్రీముఖి అవకాశవాది అంటూ షాకింగ్ కామెంట్స్

బిగ్‌బాస్‌ హౌస్‌లో 8 వ వరం కాస్త సందడిగా జరిగింది. వీకెండ్‌లో వచ్చిన నాగర్జున‌.. హౌస్‌మేట్స్‌ చేసిన తప్పులను సరిదిద్దే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఇంటి సభ్యులతో కాస్త కటువుగా ప్రవర్తించాడు. అయితే నేటి ఎపిసోడ్‌లో పూర్తిగా ఎంటర్‌టైన్‌ చేసే ప్రయత్నం చేశాడు. హౌస్‌మేట్స్‌కు కొన్ని టాస్క్‌లను ఇచ్చి ఫన్‌ క్రియేట్‌ చేసేందుకు ట్రై చేశాడు. చివరగా ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదరుచూసే ఎలిమినేషన్ పార్ట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసారు. ఈ వారం ఎలిమినేషన్ ప్రకియలో శ్రీముఖి, శిల్పా చక్రవర్తి,పునర్నవి, మహేష్ విట్టా ఉండగా శిల్పా చక్రవర్తి ఎలిమినేట్‌ అయినట్లు ప్రకటించాడు. అయితే ఈ విషయం హౌస్‌మేట్స్‌ కంటే ముందే ప్రేక్షకులకు తెలిసిపోవడంతో అంత ఆశ్చర్యానికి గురి కాలేదు.శనివారం సాయంత్రమే శిల్పా ఎలిమినేట్‌ అయినట్లు వార్తలు వైరల్‌ అయ్యాయి. దీంతో రెండో వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ కూడా తుస్సుమన్నట్లు నెటిజన్లు కామెంట్లు పెట్టారు.

బయటకు వచ్చిన శిల్పా.. హౌస్‌మేట్స్‌పై తన అభిప్రాయాన్ని పంచుకుంది. మహేష్‌.. తిక్కలోడు, శివజ్యోతి.. అందాల రాక్షసి, రాహుల్‌.. కోపిష్టి, రవి.. మొండోడు, పునర్నవి.. మూర్ఖురాలు, వితికా.. గయ్యాలి, హిమజ.. అహంకారి, బాబా.. జిత్తులమారి నక్క, శ్రీముఖి.. అవకాశవాది అంటూ చెప్పుకొచ్చింది. డే టైమ్‌లో ఎవరు నిద్రపోయినా.. కుక్కలు అరిసినా.. స్విమ్మింగ్‌పూల్‌లో దూకాలనే బిగ్‌ బాంబ్‌ను మహేష్‌పై వేసింది.