Home / 18+ / వాల్మీకి పై ఫుల్ క్లారిటీ..తెర వెనుక రహస్యం ఇదే !

వాల్మీకి పై ఫుల్ క్లారిటీ..తెర వెనుక రహస్యం ఇదే !

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం వాల్మీకి. ఈ చిత్రానికి గాను హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు సెప్టెంబర్ 20న రానుంది. అయితే ఈ చిత్రంపై ఇప్పటికే ఎన్నో వదంతులు వస్తున్నాయి. అంతేకాకుండా ఈ చిత్ర టైటిల్ విషయంపై కోర్టు లో కేసు కూడా ఉంది. భోయ సంఘం వారు ఈ చిత్ర టైటిల్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించారు. దీనిపై చిత్ర యూనిట్ ఇందులో ఎవరి మనోభావాలు దెబ్బతీసేలా సన్నివేశాలు ఉండవని క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇక టైటిల్ విషయానికి వస్తే.. ఈ చిత్రానికి ఈ టైటిల్ నే ఎందుకు పెట్టారని మీడియా వారు అడగగా..డైరెక్టర్ హరీష్  ఆసక్తికరమైన జవాబు ఇచ్చారు. ఒక మనిషి ఊహకి అందనంత మార్పు ఈ వాల్మికి పాత్రలో ఉంటుందని డైరెక్టర్ ఫుల్ క్లారిటీ ఇవ్వడం జరిగింది.