Home / NATIONAL / మొబైల్ నుంచే ఇక జనరల్,ఫ్లాట్ ఫాం టికెట్లు

మొబైల్ నుంచే ఇక జనరల్,ఫ్లాట్ ఫాం టికెట్లు

రైలులో ప్రయాణమంటే ముందు టికెట్ తీసుకోవాలి. రిజర్వేషన్ అయితే ఏ సమస్య ఉండదు. కానీ జనరల్ టికెట్లైన .. ఫ్లాట్ ఫాం టికెట్లైన సరే వాటి కోసం మినిమమ్ గంట నుండి ఆపై సమయం వరకు క్యూలో నిలబడి తీసుకోవాలి. ఈ టికెట్ తీసుకునేలోపు మనం ఎక్కాల్సిన ట్రైన్ వెళ్ళిపోతుంది ఒక్కోక్కసారి. అయితే ఇలాంటి సమస్యలు పునారవృత్తం కాకుండా సరికొత్త యాప్ ను తీసుకొచ్చింది . అదే యూటీఎస్ .సెంటర్ ఫర్ రైల్వే ఇన్ ఫర్మేషన్ సిస్టమ్ (క్రిస్)అభివృద్ధి చేసిన ఈ ఆన్ లైన్ యాప్ ను మొబైల్ లోని ప్లే స్టోర్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
ఎలా ఉపయోగించాలి. ఎలా టికెట్ బుక్ చేసుకోవాలో చూద్దాం.
*ముందుగా ఆ యాప్ లో మన డీటైయిల్స్ ఎంటర్ చేయాలి.
*విజయవంతంగా ఎంటర్ చేశాక రైల్వే వ్యాలెట్ ఆటోమేటిక్ గా క్రియేటవుతుంది.
*ఈ ఆర్ వ్యాలెట్లో నగదు కూడా జమ చేసుకోవచ్చు. ఆ తర్వాత కోరుకున్న చోట లేదా ఎంపిక చేసిన రైల్వే స్టేషన్ ఫ్లాట్ ఫామ్ టికెట్ ను బుక్ చేసుకోవాలి.
*అయితే పేపర్ టికెట్ కావాలనుకున్నవాళ్లు ఆన్ లైన్ చేశాక సంబంధిత స్టేషన్ కు చేరుకున్నాక అక్కడ ఉన్న ఏవీటీఎం మిషన్ లో బుకింగ్ ఐడీ,టికెట్ వివరాలు ఎంట్రీ చేస్తే టికెట్ వస్తుంది.
*అయితే ఇక్కడ ప్రధాన సమస్య ఎంటంటే అక్కడ టికెట్ తీసుకున్న గంటలోపే మనం ప్రయాణం మొదలెట్టాలి.
*అలా అని మనం రైల్వే స్టేషన్ లో ఉండి టికెట్ బుక్ చేసుకునే సదుపాయం మాత్రం లేదు .
*ఫ్లాట్ ఫామ్ టికెట్లను క్యాన్సిల్ చేసుకునే సదుపాయం లేదు కానీ టికెట్ బుక్ చేసుకున్న పేపర్ టికెట్ తీసుకుంటే టికెట్ క్యాన్సిల్ చేసుకునే వీలుంది.
*అది ఎలాగో మనం డౌన్ లోడ్ చేసుకున్న యూటీఎస్ యాప్ లో ఉంటుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat