Breaking News
Home / MOVIES / మరోసారి అడ్డంగా బుక్కైన నయనతార

మరోసారి అడ్డంగా బుక్కైన నయనతార

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటి నయనతార మరోసారి బర్త్ డే పార్టీ సాక్షిగా అడ్డంగా దొరికేసింది. ఆమె విఘ్నేష్ తో ప్రేమాయణం సాగిస్తుందని అందరికీ తెల్సిందే. అయితే ఎక్కడ కూడా ఇటు నయనతార కావచ్చు అటు విఘ్నేష్ కావచ్చు వీరిద్దరూ ఎవరు అధికారకంగా తాము ప్రేమలో ఉన్నట్లు చెప్పలేదు.

కానీ నయనతార మాత్రం తాను విఘ్నేష్ తో ప్రేమాయణం సాగిస్తున్నట్లు తన ప్రవర్తనతో.. పనులతో బయటపెట్టుకుంటూ వస్తుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా తన భాయ్ ఫ్రెండ్ అయిన విఘ్నేశ్ బర్త్ డే పార్టీని నయనతార తన దోస్తులతో కల్సి చాలా ఘనంగా చేసుకుంది.

ప్రముఖ దర్శకుడు అట్లీ,యువసంగీత దర్శకుడు అనిరుధ్,హీరో విజయ్ సేతుపతిలతో కల్సి డ్రస్ కోడ్ బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకుని మరి కేక్ కట్ చేసి విఘ్నేష్ బర్త్ డే ను జరుపుకున్న ఫోటోలు ఇప్పుడు బయటకు వచ్చాయి. దీంతో తాను విఘ్నేష్ తో ప్రేమలో ఉన్నట్లు చెప్పకనే చెప్పింది ముద్దుగుమ్మ.