Breaking News
Home / MOVIES / ఈ రోజు ఇద్దరిలో ఒక్కరే ఎలిమినేట్‌ …మ్యాటర్ లీక్

ఈ రోజు ఇద్దరిలో ఒక్కరే ఎలిమినేట్‌ …మ్యాటర్ లీక్

బిగ్‌బాస్‌ తొమ్మిదో వారంలోఇచ్చిన ట్విస్ట్‌ అందరికీ పెద్ద షాక్‌. డబుల్‌ ఎలిమినేషన్‌ అని చెప్పి శనివారం రాహుల్‌ ఎలిమినేట్‌ అయినట్టు ప్రకటించి.. హౌస్‌మేట్స్‌ను షాక్‌కు గురి చేశాడు. అయితే ఇంతవరకు ఓకే అని అనుకుంటూ ఉంటే.. చూసే ప్రేక్షకుడికి మరో షాక్‌ ఇచ్చాడు. అంతా ఎమోషనల్‌ అవ్వడం చూసి ప్రేక్షకులు కూడా రాహుల్‌ ఎలిమినేషన్‌ను జీర్ణించుకోలేకపోతున్న సమయంలో ఇదంతా ఫేక్‌ ఎలిమినేషన్‌ అంటూ మరో షాక్‌ ఇచ్చాడు. దీంతో రాహుల్‌ కూడా ఆశ్చర్యానికి గురయ్యాడు. ఇక రాహుల్‌ను సీక్రెట్‌ రూమ్‌లోకి పంపించిన బిగ్‌బాస్‌ ఏ ఆట ఆడిస్తాడో చూడాలి.

అయితే రాహుల్‌ ఎలిమినేట్‌ కాలేదని, సీక్రెట్‌ రూమ్‌లోకి పంపించాడని శనివారం సాయంత్రం ప్రోమో రిలీజ్‌ చేసిన వెంటనే ట్రెండ్‌ అయింది. అయితే ఇందులో ఎంత నిజమున్నదో అప్పుడు తెలియక కొందరు అవన్నీ రూమర్స్‌గానే కొట్టిపారేశాడు. అయితే ప్రోమోలో అంతా తెలిసేట్టు కట్‌చేయడంతో అంత సస్పెన్స్‌గా అనిపించలేదు. ప్రోమోలో అలా చేశాడంటే.. కచ్చితంగా బిగ్‌బాస్‌ మైండ్‌లో ఏదో మర్మం ఉందని ఊహించిన నెటిజన్లు.. ఆయన ఆలోచనలను ఇట్టే పసిగట్టారు. రాహుల్‌ సీక్రెట్‌ రూమ్‌లో ఉన్నాడని ముందే చెప్పేశారు. అంతేకాదు ఈ వారం ఎలిమినేట్‌ అయ్యోది ఖచ్చితంగా హిమజనే అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అదేంటో మరి ఒక రోజే ముందే ఎలిమినేట్‌ ఎవరు అనేది మొదటి ఏపిసోడ్ నుండి నెటిజన్లకు తెలిసిపోతుంది.