Home / MOVIES / బాహుబలి రికార్డులను “సైరా” బద్దలు కొడితే… పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు…!

బాహుబలి రికార్డులను “సైరా” బద్దలు కొడితే… పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు…!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, మెగాపవర్ స్టార్ రాంచరణ్ నిర్మాతగా, సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో వస్తోన్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం..సైరా. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం అక్టోబర్ 2 న రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా ఆదివారం నాడు సైరా మూవీ ప్రీరిలీజ్ ఫంక్షన్‌ను హైదరాబాద్‌లో అట్టహాసంగా నిర్వహించారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, బాహుబలితో తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన డైరెక్టర్ రాజమౌళి, కొరటాల శివ, వివివినాయక్, అల్లు అరవింద్ వంటి ఎందరో ప్రముఖులు ఈ ఫంక్షన్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ రాజమౌళిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. . ‘సైరా:నరసింహారెడ్డి’ సినిమాను భారతదేశం గర్వించే చిత్రంగా చేయడం చాలా గర్వంగా ఉంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగారు అంటే చిరంజీవిగారే గుర్తొచ్చారు. సురేందర్‌ రెడ్డిగారు చాలా బాగా తెరకెక్కించారు. . నేను నటించకముందు ‘శుభలేఖ’ లో ఒక డైలాగ్‌కి డబ్బింగ్‌ చెప్పాను. ఆ తర్వాత మళ్లీ నా గళం ఇచ్చింది ‘సైరా’ చిత్రానికే. మన దేశం కోసం, ప్రజల కోసం తీసిన సినిమా ఇది. అందుకే నా గొంతును గర్వంగా, మనస్ఫూర్తిగా ఇచ్చాను. ‘సైరా’లాంటి సినిమాలో నా భాగస్వామ్యం ఉన్నందుకు సంతోషంగా ఉంది. ఇక తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళిగారు ఇక్కడి రావడం నిజంగా సంతోషం. ఎవరు ఎన్ని విజయాలు సాధించినా మాకు అసూయ కలగదు. ఇంకా ఆనందపడతాం. ఎందుకంటే పదిమంది బాగుండాలని కోరుకునేవాళ్లం మేము. రాజమౌళిగారు రికార్డులు బద్దలు కొడితే ఆనందంగా ఉంటుంది. సురేందర్‌రెడ్డిగారు కూడా రికార్డులు బద్దలుకొడితే ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఇది మన సినిమా. మన జాతి. మన భారతజాతి. మన తెలుగుజాతి. . భారతీయులుగా మనం గర్వించేలా సినిమా తీసిన సాంకేతిక నిపుణులకు, నటీనటులకు ధన్యవాదాలు అంటూ పవన్ కల్యాణ్ ప్రసంగం ముగించారు. బాహుబలి రికార్డులపై మాకేం ఈర్ష లేదంటూనే సైరా బాహుబలి రికార్డులు బద్దలు కొడితే ఆనందంగా ఉంటుందంటూ…పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. సైరా వేరు బాహుబలి వేరు..బాహుబలి రెండు భాగాలుగా తెరకెక్కింది. సైరా ఒకే భాగంగా వస్తోంది…బాహుబలి యూనివర్సల్ అప్పీల్ ఉన్న మూవీ, సైరా ఓన్లీ భారత్‌కు పరిమితం అయ్యే చిత్రం.. అలాంటప్పుడు బాహుబలి రికార్డులు బద్ధలు కొట్టడం అసాధ్యం అన్నట్లుగా టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. మొత్తంగా బాహుబలి రికార్డులపై పవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారాయి.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat