Home / ANDHRAPRADESH / టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పనితీరు భేష్

టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పనితీరు భేష్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇటీవల టీటీడీ బోర్డు చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన వైవీ సుబ్బారెడ్డిపై ప్రశంసలు కురిపించారు. సోమవారం ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో కల్సి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ తో హైదరాబాద్ లోని ప్రగతి భవన్ ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు.

 వైవీ సుబ్బరెడ్డి తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు కుటుంబ సమేతంగా రావాలని ఆహ్వనించారు. ఇందులో భాగంగా ఆహ్వాన పత్రికను సీఎం జగన్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందజేశారు.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్”వైవీ సుబ్బా రెడ్డి టీటీడీ చైర్మన్ అయ్యాక తిరుమల తిరుపతి దేవస్థానం పనితీరు బాగుంది .. భక్తులకు కూడా సౌకర్యాలు మెరుగయ్యాయి..రోజురోజుకు టీటీడీ సేవలు బాగున్నాయి. ఇలాగే కొనసాగాలని”అనుకుంటున్నాను వైవీ సుబ్బారెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు.