Home / MOVIES / బిగ్‌బాస్‌ లో భార్యాభర్తల మధ్య పెద్ద వాదులాట..ఎందుకు అంతలా సీరియస్‌

బిగ్‌బాస్‌ లో భార్యాభర్తల మధ్య పెద్ద వాదులాట..ఎందుకు అంతలా సీరియస్‌

బిగ్ బాస్ హౌజ్‌లోకి వరుణ్ సందేశ్, వితికా షెరూ జంటను పంపించినపుడే ఏదో అవుతుందని ముందు నుంచి అనుకుంటున్నారు. ఇప్పుడు అనుకున్నంతా అయిపోయింది.. ఈ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టేసాడు బిగ్ బాస్. తాజాగా విడుదలైన ప్రోమోలో ఈ ఇద్దరూ గొడవ పడుతున్నదే హైలైట్ చేసారు. వరుణ్ సందేశ్, వితిక షెరూ ఇద్దరూ అరుచుకుంటున్న విజువల్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అసలు ఎందుకు ఈ ఇద్దరూ ఇలా గొడవ పడుతున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక నిన్నటి ఎపిసోడ్‌లో మహేశ్‌, రాహుల్‌కు గొడవ జరగగా నేడు వరుణ్‌, వితికలకు భేదాభిప్రాయాలు వచ్చినట్టు కనిపిస్తోంది. రాళ్లు సేకరించే క్రమంలో బాబా, వితిక ఒకరినొకరు తోసుకున్నట్టుగా కనిపిస్తోంది. ఈ తోపులాటలో వితిక కిందపడింది. దీంతో చూస్కొని ఆడొచ్చు కదా అంటూ వితిక అసహనంతో ఊగిపోయింది. ‘ఇది టాస్క్‌.. అలానే జరుగుతుంది, టాస్క్‌లో దెబ్బలు తగులుతాయి’ అంటూ వరుణ్‌.. వితికపై ఫైర్‌ అయ్యాడు. దీంతో భార్యాభర్తల మధ్య పెద్ద వాదులాటే జరిగింది. ఆడితే ఆడు, లేకపోతే లేదంటూ వితికపై మండిపడ్డాడు. వితికపై ఈగ కూడా వాలనివ్వని వరుణ్‌.. ఎందుకు తనపై అంతలా సీరియస్‌ అయ్యాడు? అసలు వీరి గొడవ ఎక్కడిదాకా వెళుతుంది అనేది నేటి ఎపిసోడ్‌లో తేలనుంది. ​కాగా ఇప్పటికే రాహుల్‌ నామినేట్‌ అవగా, నేటి ఎపిసోడ్‌లో ఎవరు నామినేషన్‌ జోన్‌లోకి రానున్నారో చూడాలి!