Home / 18+ / మెగాస్టార్ ని కలిసిన జబర్దస్త్ టీమ్..!

మెగాస్టార్ ని కలిసిన జబర్దస్త్ టీమ్..!

సైరా నరసింహారెడ్డి సక్సెస్ తో ఫుల్ జోష్ మీద ఉన్న మెగాస్టార్ చిరంజీవిని జబర్దస్త్ టీమ్ కలిశారు. రాంప్రసాద్, హైపర్ ఆది, వేణు, సుధాకర్, బుల్లెట్ భాస్కర్, శీను అందరూ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల మెగా హీరోల సినిమాలు జబర్దస్త్ కామెడీ హీరోలకు అనేక అవకాశాలు కల్పిస్తున్నారు. రంగస్థలం, గణేష్ ఇలా చాలా సినిమాల్లో జబర్దస్త్ లో చాలా మంది తళుక్కున మెరుస్తున్నారు. తాజాగా సైరా హిట్ అయిన నేపథ్యంలో వీరంతా చిరంజీవి సోదరుడు నాగబాబు సమక్షంలో చిరుని కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి ఎప్పటికీ టాప్ లోనే అని. అతని పేరు చెప్పుకునే వాళ్ళమని ఇప్పుడు ఆయన్ని స్వయంగా కలవడం నిజంగా సంతోషంగా ఉందని అన్నారు. చిరంజీవి ని కలవడం తన జీవితంలో మర్చిపోలేము అంటూ సంతోషపడుతున్నారు జబర్దస్త్ నటులు.