Home / 18+ / మెగాస్టార్ ను తట్టుకునే శక్తి ఆ దర్శకుడుకు ఉందంటారా..?

మెగాస్టార్ ను తట్టుకునే శక్తి ఆ దర్శకుడుకు ఉందంటారా..?

టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో కొరటాల శివ ఒకరూ అనడంలో ఎటువంటి సందేహం లేదు…ఇంకా చెప్పాలంటే అంతకుమించే అని చెప్పాలి. తాను తీసే సినిమాలు ఎటువంటి వారికైనా ఇట్టే నచ్చుతాయి. ఇక అసలు విషయానికి వస్తే ఈ డైరెక్టర్ కు ఎప్పటినుండో మెగాస్టార్ చిరంజీవి తో సినిమా తియ్యాలనే కోరిక ఉంది. అది ఇన్ని రోజులకు నిర్వేరనుంది. అయితే తాను తీసిన చిత్రాలు జనతా గేరేజ్, శ్రీమంతుడు, భరత్ అనే నేను అలానే ఈ సినిమా కూడా ఉంటుంది అనే పుకారు మొదలైంది. కాని ఆ పుకారు తప్పని ఎందుకంటే మెగాస్టార్ వయస్సు పరంగా చూసుకున్న అలాంటి చిత్రాలు కాకుండా స్టొరీ మారుస్తారని అనుకుంటున్నారు. ఇక చిరంజీవి ఖైదీ నెం. 150 మరియు సైరా నరసింహారెడ్డి సినిమాలతో అటు కలెక్షన్లు పరంగా, సినిమా పరంగా అంతా హిట్ అనే చెప్పాలి. దాంతో దర్శకుడు తనపై ఉన్న వత్తిడి కాస్తా తగ్గించుకున్నాడు. ఎందుకంటే చిరు చివరిగా నటించిన సినిమాలు చూసుకుంటే ఇప్పుడు ఈ  కొత్త సినిమా విషయంలో ఎలాంటి స్టొరీ ఎంచుకున్నా చిరు క్రేజ్ కు పర్వాలేదని ధైర్యం వచ్చేసింది.