Home / ANDHRAPRADESH / బీరు బాబులకు ఝలక్

బీరు బాబులకు ఝలక్

మీకు బీరు త్రాగే అలవాటు ఉందా.. ?. మీరు బీరు త్రాగకుండా నిద్రపోరా..?. అసలు బీరు ముట్టకుండా మీకు తెల్లారదా..?. అయితే ఇది మీ కోసమే. ఇప్పటికే ఏపీలో ఒక వ్యక్తికి లైసెన్స్ లేకుండా తన వద్ద గరిష్టంగా మూడు బీర్లను ఉంచేందుకు మాత్రమే అనుమతినిస్తూ వైసీపీ ప్రభుత్వం తాజా ఉత్తర్వులను జారీ చేసింది.

అయితే గత నెలలో గరిష్టంగా ఆరు బీరులను ఉంచేందుకు అనుమతిచ్చిన ప్రభుత్వం తాజాగా దాని సంఖ్యను మూడుకు తగ్గించింది. ఈ క్రమంలో ఏ సైజు బీరు అయిన సరే కేవలం మూడు బీర్లను మాత్రమే ఒక వ్యక్తి లైసెన్స్ లేకుండా తన దగ్గర ఉంచేందుకు ప్రభుత్వం తాజా ఉత్తర్వులను జారీ చేసింది. దశల వారిగా మద్యాన్ని నియంత్రించేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని వైసీపీ నేతలు చెబుతున్నారు.