Home / ANDHRAPRADESH / సీఎం జగన్ సంచలన నిర్ణయం

సీఎం జగన్ సంచలన నిర్ణయం

ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అధికారంలోకి వచ్చి పట్టు మని పది నెలలు కాకుండానే జగన్ ముఖ్యమంత్రిగా పలు సంచలనాత్మక సంస్కరణల వంతమైన నిర్ణయాలను తీసుకుంటూ యావత్తు దేశాన్ని ఏపీ వైపు చూసేలా చేస్తోన్నారు.

తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి న్యాయవాదులకు రూ.5 వేల ప్రోత్సాహకాన్ని ఇవ్వాలని నిర్ణయించారు. అంతేకాకుండా మత్స్యకారులు వినియోగించే బోట్లకు సంబంధించి డీజిల్ పై సబ్సిడీ ఇవ్వనున్నట్లు వైసీపీ సర్కారు ప్రకటించింది. ఇందులో భాగంగా వారికి లీటర్ డీజిల్ పై రూ.9 ల వరకు సబ్సిడీ ఇస్తున్నట్లు వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ ప్రభుత్వం తెలిపింది.