Home / SLIDER / రోహిత్ ఖాతాలో మరో రికార్డు

రోహిత్ ఖాతాలో మరో రికార్డు

టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తన ఖాతాలో మరో రికార్డును చేర్చుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న రాంచీ టెస్టులో ఓపెనర్ గా బరిలోకి దిగిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సూపర్ ఫామ్ తో పలు రికార్డ్లను తన పేరిట లిఖిస్తున్నాడు.

సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో 150+ స్కోరు సాధించిన రోహిత్ ఒకే సిరీస్ లో సౌతాఫ్రికాపై 150+ స్కోరు రెండు సార్లు చేసిన తొలి ఇండియా ఓపెనర్ గా నిలిచాడు.ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిదో ఆటగాడిగా నిలిచాడు. సరిగ్గా ఆరేళ్ల కిందట అంటే 2012-13 తర్వాత ఈ ఘనత సాధించిన ఘనత ఒక్క రోహిత్ కే దక్కింది.