Breaking News
Home / SLIDER / టీపీసీసీకి కొత్త బాస్

టీపీసీసీకి కొత్త బాస్

తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడుగా ఉన్న నల్లగొండ ఎంపీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టుబట్టి మరి తన సతీమణి అయిన ఎన్ ఉత్తమ్ పద్మావతి రెడ్డిని ఇటీవల జరిగిన హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టిన సంగతి విదితమే. గురువారం విడుదలైన ఈ ఉప ఎన్నికల ఫలితాల్లో ఉత్తమ్ పద్మావతి రెడ్డి అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిపై నలబై మూడు వేల ఓట్లకు పైగా భారీ తేడాతో ఆమె పరాజయం పాలయ్యారు.

దీంతో ఉత్తమ్ ను పీసీసీ పదవీ నుండి తప్పించడం ఖాయమంటున్నారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ప్రస్తుతం బాస్ గా ఉన్న ఉత్తమ్ నేతృత్వంలో ఇంతవరకు ఏ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించకపోవడం..

ముందు మున్సిపల్ ఎన్నికలు ఉండటంతో క్యాడర్లో నూతనోత్తేజం నింపడం కోసం పీసీసీ బాస్ మార్పు ఖాయమైన నేపథ్యంలో కొత్త బాసుగా ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి,సీనియర్ నేతలు వీహెచ్,ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పేర్లు విన్పిస్తోన్నాయి.