Home / SLIDER / ప్రపంచంలోనే తొలిసారిగా షావోమి

ప్రపంచంలోనే తొలిసారిగా షావోమి

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ,చైనాకు చెందిన మొబైల్ దిగ్గజం షావోమి మరో సరికొత్త రికార్డు నమోదుకు సిద్ధమవుతుంది. ఇప్పటికే ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద స్మార్ట్ ఫోన్ బ్రాండ్ గా.. ఇండియాలోనే నెంబర్ వన్ బ్రాండ్ గా ఉన్న షావమి ప్రపంచంలోనే తొలిసారిగా సరికొత్త రికార్డుకు నాంది పలుకుతుంది.

ఇందులో భాగంగా వరల్డ్ ఫస్ట్ హెవీ కెమెరాతో స్మార్ట్ ఫోన్ ను విడుదల చేయడానికి షావోమి రెడీ అవుతుంది. దీనికి సంబంధించి ట్విట్టర్లో ఒక ఫోటోను షేర్ చేసింది. ఎంఐ నోట్ 10,ఎంఐ నోట్ 10 ప్రొ (ఎంఐసీసీ 9ప్రొ)పేరుతో స్మార్ట్ ఫోన్లను తీసుకురానున్నదని సమాచారం.

ఇందులో విభిన్న ప్రాసెసర్లతో పాటుగా అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంటాయని టిప్ స్టర్ ముకుల్ శర్మ కూడా ట్వీట్ చేయడం విశేషం.