పలు రాజకీయ పార్టీలకు దిమ్మతిరిగే షాకిస్తూ సోషల మీడియా దిగ్గజం ట్విట్టర్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా ట్విట్టర్లో అన్ని రాజకీయ పార్టీల ప్రకటనలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది.
దీనిపై వచ్చే నెల ఇరవై రెండో తారీఖు నుండి నిషేధం అమల్లో ఉంటుందని తెలిపింది. ఈ నిషేధం గురించి విధివిధానాలను నవంబర్ పదిహేనో తారీఖున వెల్లడిస్తామని ట్విట్టర్ సీఈఓ జాక్ ప్రాటిక్ డోర్సే తెలిపారు. రాజకీయ సందేశాలు ప్రజలకు చేరాలి కానీ వాటిని కొనకూడదని ఈ సందర్భంగా డోర్సే ట్వీట్ చేశారు.