Home / 18+ / నాలుగు పదుల వయసు దాటినా అందం ఏ మాత్రం తగ్గకుండా రెట్టింపవుతున్న ఐశ్వర్యారాయ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు

నాలుగు పదుల వయసు దాటినా అందం ఏ మాత్రం తగ్గకుండా రెట్టింపవుతున్న ఐశ్వర్యారాయ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు

నేడు మాజీ మిస్ ఇండియా ఐశ్వర్య రాయ్ 46వ పుట్టినరోజు. ఒక సాధారణ మోడల్ గా  కెరీర్ ను ప్రారంభించిన ఐశ్వర్యరాయ్ తన నటన ద్వారా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించారు. అదే ఇండస్ట్రీ కి చెందిన బిగ్ బి తనయుడు అభిషేక్ బచ్చన్ ను వివాహం చేసుకున్నారు. పెళ్లి అయిన తర్వాత కూడా సినిమాల ద్వారా మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి తనకు ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు అని నిరూపించుకున్నారు. అనంతరం అడపాదడపా కొన్ని సినిమాల్లో నటించారు. ఐశ్వర్య రాయ్ కు ఒక కూతురు కూడా ఉంది. అభిషేక్ బచ్చన్ నిర్వహించే కబడ్డీ ప్రీమియర్ లీగ్ లకు ఐశ్వర్య బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ఉంటారు. ఒకానొక దశలోభారతదేశంలోని అన్ని భాషలలో, అన్ని రాష్ట్రాల్లో యువకులకు ఐశ్వర్యరాయ్ తమ ఫేవరెట్ హీరోయిన్ అని అనిపించుకున్నారు.

అంటే ఆమె అందానికి ఎంతమంది ఫ్యాన్స్ ఉండేవారో అర్థం చేసుకోవచ్చు. మిస్ వరల్డ్ 1994లో అయ్యారు ఐశ్వర్య. ఆమె కళ్ళు, రూపం ఆమె చూపులు ఆమె అభినయం అందాన్ని ఎంతోమంది ఆరాధించేవారు. అందానికి పర్యాయపదంగా ఐశ్వర్యరాయ్ పేరు వాడుతూ ఉండేవారు. అలాగే నాలుగు పదుల వయసు దాటినా కూడా ఆమె అందం రెట్టింపు అయ్యింది తప్ప ఏమాత్రం తగ్గలేదు. రీ ఎంట్రీ తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఐశ్వర్యారాయ్ మరిన్ని సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దరువు తరఫున ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat