Home / SLIDER / ఆదర్శంగా పల్లెలుగా తీర్చిదిద్దుతాం

ఆదర్శంగా పల్లెలుగా తీర్చిదిద్దుతాం

తెలంగాణ రాష్ట్రంలో సిద్ధిపేట జిల్లా సిద్ధిపేట అర్బన్ మండలం లింగారెడ్డి పల్లి వద్ద నిర్మించిన కొచ్చగుట్ట పల్లి భూనిర్వాసిత గ్రామంలో ని 130 ఇండ్లంల్లో లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించి మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. అనంత్గరం మంత్రి హారీష్ మాట్లాడుతూ”కోచ్ఛగుట్ట పల్లి ఇక…కొత్త గుట్ట పల్లి…. ఈ పల్లెను నేటి నుండి రంగాయక పురంగా పిలుస్తూ ఆదర్శంగా పల్లెగా తీర్చిదిద్దుతామని” అన్నారు…
 
రంగనాయక స్వామి దేవాలయం, రంగనాయకసాగర్ రిజర్వాయర్ సమీపంలో ఉన్నందున తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదట ప్రారంభించుకుంటున్న ఈ ఆర్ అండ్ ఆర్ కాలనికి రంగనాయకపురం గా నామకరణం చేసుకుంటున్నాం.తెలంగాణ రాష్ట్రంలోనే కాదు కొత్త ఆర్ అండ్ ఆర్ చట్టం వచ్చాక ప్రారంభించుకుంటున్న మొట్టమొదటి ఆర్ అండ్ ఆర్ కాలనీ అని తెలిపారు..
 
నిర్వాసితుల త్యాగాలు వెలగట్టలేనివి.. వారికి సంపూర్ణ న్యాయం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వాసితులు అందరికి డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి ఇవ్వాలని నిర్ణయించారు…కాలనిలో అంగన్ వాడి, మిల్క్ సెంటర్, పాటశాల, దేవాలయం, సీసీ కెమెరాలు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం..అనంతగిరి రిజర్వాయర్ లో నిర్వాసితులందరికి చేపలపై శాశ్వత హక్కు కల్పిస్తున్నామని అన్నారు..
 
ఈ ప్రాజెక్టుల కింద ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు మేడ్చల్ జిల్లాలోని వేలాది ఎకరాలకు సాగు నీరు అందుతుంది. .ఈ ప్రాజెక్టుల్లో ఏడాది కాలం పాటు నీళ్లు ఫుల్ గా ఉంటాయి… యేడాది పొడుగునా ఉపాది ఉంటుంది.కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు చేయని ప్రయత్నాలంటూ లేవు… దైవ కృపతో అన్ని అడ్డంకులు దాటుకుంటూ ప్రాజెక్టులు పూర్తి చేపట్టుకుంటున్నాము
 
త్వరలోనే అనంతగిరి, రంగనాయకసాగర్ ప్రాజెక్టుల్లోకి నీళ్లు వస్తాయి…రాబోయే రోజుల్లో సిద్దిపేట ప్రాంతానికి ఫుడ్ ఇండస్ట్రీ పార్కులు వస్తున్నాయి.. ఈ రంగనాయకపురంలో చదువుకున్న వారు ఉంటే వారికి ఉద్యోగాలు వచ్చేలా చూస్తా…భునిర్వాసితులను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత మాపై ఉంది…ఉరుకు ఊరును రూపోందించాం.. అన్ని వసతులను ఇక్కడ కల్పించాం…ఇంకా మిగిలిపోయిన సమస్యలు ఉంటే త్వరలోనే పరిష్కరిస్తామని పేర్కొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat