బుధవారం దేశీయ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ సరికొత్త రికార్డును నమోదు చేసింది. నిర్మాణ రంగానికి ఊతమిచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం,రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకుంటాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యులు నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనతో రియల్ ఎస్టేట్ షేర్లు పరుగులు పెట్టాయి.
ఇండియా బుల్స్ ,శోభా,ప్రెస్టిజ్ ఎస్టేట్ ప్రాజెక్టుల షేర్లు ఐదు శాతం వరకు లాభపడ్డాయి. సెన్సెక్స్ 256 పాయింట్లు లాభపడి మొత్తం 40,504 వద్ద ముగిసింది. నిప్టీ అరవై రెండు పాయింట్లు లాభపడి 11,979 వద్ద ట్రేడవుతున్నాయి.