Home / SLIDER / టీపీసీసీ చీఫ్ మార్పుకు ముహుర్తం ఖరారు..!

టీపీసీసీ చీఫ్ మార్పుకు ముహుర్తం ఖరారు..!

తెలంగాణ పీసీసీ చీఫ్ ను మార్చబోతున్నారా..?.ఇప్పటికే పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో గత సార్వత్రిక ఎన్నికల దగ్గర నుండి నిన్నటి హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల వరకు జరిగిన ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరపరాజయం పాలైంది.

ఈ నేపథ్యంలో పీసీసీ చీఫ్ మార్పు అనివార్యమని ఆ పార్టీకి చెందిన నేతలే ఇటీవల బాహటంగా విమర్శించారు కూడా.ఇందులో భాగంగానే పీసీసీ నేతలతో పార్టీ సీనియర్ నేత గులామ్ నబీ అజాద్ తో భేటీ సందర్భంగా కూడా ఈ విషయం చర్చకు వచ్చినట్లు సమాచారం.

ఈ క్రమంలో త్వరలో తెలంగాణలో పురపాలక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు చీఫ్ మార్చిస్తే కేడర్లో అయోమయం నెలకొంటుంది.అందుకే పురపాలక ఎన్నికల తర్వాత పీసీసీ చీఫ్ మార్చడం మంచిదని నిర్ణయించారని వార్తలు వస్తోన్నాయి.చూడాలి మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో. ?