Home / ANDHRAPRADESH / మీ పిల్లలు ఏ స్కూళ్లలో చదువుతున్నారంటూ గట్టి కౌంటర్ ఇచ్చిన సీఎం జగన్

మీ పిల్లలు ఏ స్కూళ్లలో చదువుతున్నారంటూ గట్టి కౌంటర్ ఇచ్చిన సీఎం జగన్

గ్రామీణ ప్రాంత విద్యార్థులు అంత‌ర్జాతీయ అవ‌కాశాల‌ను అందిపుచ్చుకోవాల‌న్న  ల‌క్ష్యంతోనే ఇంగ్లీష్ మాధ్య‌మాన్ని త‌ప్ప‌నిస‌రి చేస్తూ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్ స్ప‌ష్టం చేశారు. కార్పొరేట్ స్కూళ్ల‌కు ధీటుగా గ్రామీణ ప్రాంత పిల్ల‌ల‌కు పేద పిల్ల‌ల‌కు నాణ్య‌మైన విద్య‌ను అందించాల‌నే స‌దుద్దేశంతో రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ఆంగ్ల మాధ్య‌మాన్ని త‌ప్ప‌నిస‌రి చేసింది. అయితే ఈ నిర్ణయం పట్ల తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు వ్యతిరేకించే తెలుగుభాషపై జగన్కు ప్రేమ లేదని విమర్శించారు ఈ క్రమంలో లో నేరుగా స్పందించారు. పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువులు చదువుతే తప్పేమిటని ప్రశ్నించారు. ముఖ్యంగా తనను విమర్శిస్తున్న ప్రభుత్వాన్ని తప్పుపడుతున్న వ్యక్తుల పిల్లలు వారి మనవళ్ళు మనవరాళ్ళు ఏ మీడియంలో చదువుతున్నారు. పేద పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చదివించమంటే మీకు ఎందుకు అంత బాధ అంటూ ప్రశ్నించారు.