Breaking News
Home / MOVIES / వెంకీ మామ రీలీజ్ డేట్ వచ్చేసింది

వెంకీ మామ రీలీజ్ డేట్ వచ్చేసింది

టాలీవుడ్ దర్శకుడు బాబీ దర్శకత్వంలో సురేశ్ ప్రొడక్షన్స్,కోన ఫిల్మ్ కార్పొరేషన్ ,పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించగా బయట మామ అల్లుళ్ళు అయిన స్టార్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, యువహీరో అక్కినేని నాగచైతన్య హీరోలుగా ,పాయల్ రాజ్ పుత్, రాశీఖన్నా హీరోయిన్లుగా తెరకెక్కుతున్న మూవీ వెంకీ మామ. ఈ మూవీకి సంబంధించి షూటింగ్ అంతా పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.

ఈ మూవీ సంక్రాంతికి విడుదల చేయాలని ముందుగా అనుకున్నారు. కానీ అనుకున్నదానికంటే ముందుగా ఈ చిత్రం తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ మూవీలో హీరోలో ఒకరైన విక్టరీ వెంకటేష్ పుట్టిన రోజు వచ్చే నెల డిసెంబర్ పదమూడో తారీఖు.

 వెంకటేష్ పుట్టిన రోజుని పురస్కరించుకుని అదే రోజు వెంకీ మామ విడుదల చేయాలని చిత్రం యూనిట్ నిర్ణయించింది అని వార్తలు వస్తోన్నాయి. సో మొత్తానికి విక్టరీ వెంకటేష్ పుట్టిన రోజు కానుకగా వెంకీ మామ మూవీ విడుదల కానున్నది అన్నమాట.