Home / MOVIES / పిక్ లో పిల్ల చూస్తే పిటపిటలాడుతుంది..కానీ ఏం లాభం

పిక్ లో పిల్ల చూస్తే పిటపిటలాడుతుంది..కానీ ఏం లాభం

టాలీవుడ్ లో రకుల్ ప్రీత్ సింగ్ జోరు మధ్య కొంత తగ్గిన మాట వాస్తవమే కానీ సోషల్ మీడియాలో ఏ మాత్రం తగ్గలేదు. తగ్గడం సంగతి దేవుడెరుగు.. స్పీడ్ పెరిగింది. రకుల్ ఈమధ్య హిందీ సినిమాల్లో నటిస్తూ అక్కడ కెరీర్ సెట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది . అయితే రకుల్ కి బాలీవుడ్ లోని మార్జావ ప్లాప్ టాక్ తో అయోమయంలో పడింది. ఎమన్నా అంటే రకుల్ పనైపోయింది అంటారు అంటూ గుంజుకునే రకుల్ కి మూడు భాషల్లోనూ షాకులు తప్పడం లేదు. అయినా గ్లామర్ విషయంలో వెనకడుగు వెయ్యకుండా రోజు రోజుకి గ్లామర్ డోస్ పెంచడమే ధ్యేయంగా పెట్టుకుంది. ఇప్పుడు తాజాగా రకుల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పిక్ లో పిల్ల చూస్తే పిటపిటలాడుతుంది.. కానీ ఏం లాభం అంటూ నెటిజెన్స్ జాలి చూపిస్తున్నారు. హీరో ఎవరైతే నాకేంటి అంటూ సీనియర్ హీరోల పక్కన నటించి బాగా దెబ్బతింది. ఇప్పుడు రకుల్ కి ఆ సీనియర్ హీరోలు తప్ప కుర్ర హీరోలు ఛాన్స్ ఇచ్చేలా కనిపించడం లేదు. పాపం రకుల్ ఎంత గ్లామర్ షో చేసినా.. ఎన్ని అందాలు చూపించినా వేస్టే మరి.