Home / ANDHRAPRADESH / తన అభిమానులను ఉగ్రవాదులుగా తయారుచేస్తున్న పవన్ కళ్యాణ్..!

తన అభిమానులను ఉగ్రవాదులుగా తయారుచేస్తున్న పవన్ కళ్యాణ్..!

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన పార్టీ కార్యకర్తలను నాయకులను ఉగ్రవాదులుగా మారుస్తున్నారని వైసిపి సోషల్ మీడియా సైన్యం విరుచుకు పడుతోంది. తాజాగా అనంతపురం జిల్లా రాప్తాడు లో జరిగిన మీటింగ్ లో జనసేన పార్టీ నాయకుడు మురళి మాట్లాడుతూ మా పార్టీ అధ్యక్షుడు ఆదేశిస్తే వైసీపీ ఎమ్మెల్యేల నరికేస్తాం.. అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే వేదికపై ఉన్న పవన్ కళ్యాణ్ ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉన్నారే తప్ప అలాంటి వ్యాఖ్యలు కరెక్ట్ కాదని ఖండించలేదు. అలాగే ఇటీవల ప్రియాంక రెడ్డి హత్యకు సంబంధించి జరిగిన ఘటనలో చాలామంది పవన్ కళ్యాణ్ అభిమానులు హంతకులను సమర్థిస్తూ ఫేస్బుక్ లో పోస్టులు పెట్టారు.

 

 

 

అయితే ఒక పార్టీ అధ్యక్షుడు బాధ్యతాయుతంగా మాట్లాడకుండా ఇష్టానుసారంగా మాట్లాడితే ఆ ప్రభావం జనసేన పార్టీ కార్యకర్తలపై ఈ విధంగా ఉంటుంది అని దానికి ఇవే ప్రత్యక్ష ఉదాహరణ. పవన్ కళ్యాణ్ ఎక్కడ మీటింగ్ పెట్టినా రండి తేల్చుకుందాం.. మీ తల లేదా నా తల ఎగిరి పడాలి.. రండి కొట్టుకుందాం.. తేల్చుకుందాం.. కత్తులతో రండి.. కొడవళ్ళతో రండి.. పలుగులతో రండి.. ఉరికించి కొడతా.. పరుగెత్తించి కొడతా. తోలు తీసేస్తా.. తాటతీస్తా.. చావు చచ్చిపోయారా.. ధైర్యం లేదా.. పిరికితనంతో బతుకుతున్నారు.. అంటూ ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.. పార్టీ అధినేత జనసేనాని మాట్లాడిన ఈ వ్యాఖ్యలు ఖచ్చితంగా ఆయన అనుచరులు, అభిమానులపై జనసైనికులపై పడుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.