Home / SLIDER / ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటాం

ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటాం

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు తమ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని రాష్ట్ర పశుసంవర్దక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు.ఈ రోజు శనివారం హైదరాబాద్ మహనగరంలోని మారేడ్‌ పల్లిలోని తన నివాసంలో ఇటీవల ఆర్టీసీ సిబ్బంది నిర్వహించినసమ్మెకాలంలో మరణించిన ఆర్టీసీ కార్మికుల కుటుంబ సభ్యులకు ఆర్ధికసాయంకింద చెక్కులను, ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు.

ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆర్టీసీ సంస్థను లాభాల్లోకి తీసుకు వచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు. అంతే కాకుండా ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం సొంత బిడ్డల్లా చూసుకుంటుందని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. మరణించిన ఆర్టీసీ కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం, 2లక్షల చొప్పున ఆర్ధిక సాయం అందిస్తామని ప్రభుత్వం  హామీచ్చింది.

ఈ మేరకు రాణింగజ్‌ డిపోలో పనిచేస్తూ సమ్మెకాలంలో మరణించిన కండక్టర్‌ సురేందర్‌గౌడ్‌ కుమారుడు సంకీర్త్‌కు ఆర్టీసీ కానిస్టేబుల్‌ఉద్యోగంతోపాటు, 2లక్షల చెక్కును అందజేశారు. అలాగే డ్రైవర్‌ జయరాజ్‌ భార్య రేణుకారాణికి కండక్టర్‌ నియామక పత్రం, 2లక్షల రూపాయల ఆర్దిక సాయం చెక్కును అందజేశారు.