Home / ANDHRAPRADESH / హ్యాట్సాఫ్ టూ కేసీఆర్.. అసెంబ్లీలో సీఎం జగన్

హ్యాట్సాఫ్ టూ కేసీఆర్.. అసెంబ్లీలో సీఎం జగన్

మహిళలపై అత్యాచారాలకు చట్టాలు ఎన్ని వున్నా వాటి వల్ల ఎంత ఉపయోగం అన్న విషయం మాత్రం అనుమానమేనని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. అసెంబ్లీలో తమ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న మహిళా బిల్లుపై ఆయన మాట్లాడుతూ నిర్భయ అత్యాచారం కేసు జరిగి ఎంత కాలమైంది, ఇంతవరకు ఆ కేసులో తీసుకున్న చర్యలు నిరుత్సాహంగానే వున్నాయన్నారు. దిశ హత్యాచార సంఘటనలో తెలంగాణ సీఎం కేసీఆర్, తెలంగాణ పోలీసులు తీసుకున్న చర్యకు హ్యాట్సాఫ్ అన్నారు. ఆడపిల్లల తండ్రిగా ఆ చర్యను తాను పూర్తిగా సమర్ధిస్తానని చెప్పారు. ఇప్పుడు సంఘటన జరిగిన తర్వాత మానవ హక్కుల సంఘాలంటూ వచ్చి విచారణ చేస్తున్నారని అన్నారు. అందువల్ల మహిళలపై అత్యాచాఆలు జరిగినప్పుడు లోపాలు లేని చట్టాలు తీసుకురావాల్సిన అవసరముందన్నారు.